ఇష్టమైన విషయాలను తెలుసుకోండి: మీ భార్య(Wife)కు ఏ విషయాలు ఇష్టమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రతి భార్య తన భర్త(Husband) పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది. అలాగే, భర్త కూడా తమ పట్ల శ్రద్ధ వహించాలని కోరుకుంటారు. అందువల్ల, భార్యను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. దీని కోసం అప్పుడప్పుడూ మీ చేత్తో వారికి నచ్చిన వంట(Food) తినిపించి దాని రుచి నచ్చిందో లేదో అడగండి. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ కలిసి టీవీ(TV) చూడటం, ఆటలు (Games)ఆడటం వంటి చేయండి. అంతేకాక, వారు మీకు నచ్చిన పని చేసేటప్పుడు లేదా అందంగా రెడీ అనప్పుడు మెచ్చుకోవడం మర్చిపోకండి.
ఆర్థిక విషయాల గురించి చర్చించండి: మీ ఆర్థిక విషయాలను(Financial Matters) రహస్యంగా ఉంచకండి. మీ జీతం(Salary), ఖర్చులు, లావాదేవీ(Transactions)లు వంటి విషయాల గురించి మీ భార్యతో పంచుకోండి. ఇలా చేయడం వల్ల, మీ భార్యకు మీపై మరింత నమ్మకం ఏర్పడుతుంది. మహిళలు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించగలరు. తద్వారా, కష్ట సమయాల్లో వారు మీకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారిచ్చే సలహాల(Suggestions)ను సంతోషంగా స్వీకరించండి.
ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్(Electronic Gadgets)లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో, తమ ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపలేక పోతున్నారు. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహన లేమి, చిన్నచిన్న గొడవలు తీవ్రమవుతున్నాయి. ఇవి అంతిమంగా విడాకులకు దారితీస్తున్నాయి. అందువల్ల, మీ భార్యతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. వారితో కలిసి విహారయాత్రలకు. సినిమా(వునచత)కు వెళ్లడం వంటివి మీ బంధాన్ని దృఢపరుస్తాయని గుర్తించకోండి.
ఎల్లప్పుడూ వాదిస్తూ గొడవ పడకండి: ఏదైనా ఒక బంధం నిలబడాలంటే నమ్మకం, ప్రేమ(Love), స్నేహం(Friendship) వంటివి ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా మీ బంధం కలకాలం నిలబడటం కష్టమమని గుర్తించుకోండి. అందువల్ల, మీ భాగస్వామి పట్ల ప్రేమగా ఉంటూ వారి నిర్ణయాలను గౌరవించండి. ఎప్పుడూ వారితో పోరాటం లేదా వాదనలకు దిగడం మంచిది కాదు. మీ నిర్ణయమే నెగ్గాలి అనే భావనతో ఎప్పుడూ వ్యవహరించకండి. ఇది మీ బంధానికి నష్టం చేస్తుంది.