జనరల్‌గా విమానం ఎమర్జెన్సీ ల్యాండిగ్ అయ్యే పరిస్థితి ఉంటే లేక క్రాష్ అయితే... 95 శాతం మంది బతికే అవకాశాలు ఉంటాయని... అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపింది. కానీ వాస్తవంలో దాదాపు 95 శాతం మంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
జనరల్‌గా విమానంలో మనం కూర్చున్న సీటు కిందే లైఫ్ జాకెట్ ఉంటుంది. కానీ అవి నిజంగా లైఫ్ కాపాడతాయా అంటే డౌటే. అసలు వాటిని తొడుక్కునేలోపే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా ప్రమాద సందర్భాల్లో ప్రయాణికులు లైఫ్ జాకెట్ల కంటే... విమాన శకలాలను పట్టుకొనే.. నీటిపై తేలుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ జాగ్రత్తలు పాటించడంలో తప్పులేదు. నిజానికి విమాన ప్రమాదాలు జరుగుతున్నది తక్కువే. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం ప్రతి 1.1 కోటి మంది ప్రయాణికుల్లో ఒకరే విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీటి కంటే కారు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల విమాన ప్రయాణాలపై భయపడాల్సిన పనిలేదు. (ప్రతీకాత్మక చిత్రం)