వర్షాకాలంలో వాటర్ క్వాలిటీ తగ్గుతుంది. ఇలాంటి మురికి నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ లేదా ఖనిజాలు అత్యధికంగా ఉండే హార్డ్ వాటర్‌ను వాడకూడదు. ఎందుకంటే ఈ నీటి వల్ల జుట్టుపై పొర ఏర్పడుతుంది. ఈ పొర జుట్టు లోపలకి తేమను చొచ్చుకొనిపోకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. హార్డ్ వాటర్ లేదా ఉప్పు నీటితో జుట్టును వాష్ చేయడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. లేదంటే పెద్ద ఎత్తున జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ హార్డ్ వాటర్ మాత్రమే అందుబాటులో ఉంటే దానిని ఫిల్టర్ చేసి వాడుకోవడం ఉత్తమం.
కురులకు తగినంత నూనెను రాసుకుంటే జుట్టు సమస్యలన్నీ మటుమాయమవుతాయి. ఆయిల్ రాయడం వల్ల ఎలాంటి వాతావరణంలోనైనా మీ జుట్టు పాడు కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీ జుట్టును సంరక్షించుకునే ప్రయత్నాల్లో హెయిర్‌ను ప్రీకండిషన్ (Preconditioning) చేసుకోవడం మంచిది. అలానే షాంపూతో తలస్నానం చేసే ముందు వారానికి రెండుసార్లు హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు చిక్కులు పడటం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఏదైనా ఒక ఆయుర్వేద నూనెతో 15 నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసుకుంటే.. మాడు చాలా రిలాక్స్ అవుతుంది. దీని వల్ల హెయిర్ డ్యామేజ్‌ను రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. ఈ మసాజ్‌లో నేచురల్ ఆయిల్ అనేది తలకు బాగా పడుతుంది. దానిలోని పోషకాల కురుల మూలాలకు అందుతాయి. మసాజ్ వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు ఒత్తుగా త్వరగా పెరుగుతుంది.