రెడీగా ఉన్నారా? లేదా?: అసలు మీరు శృంగారానికి సన్నద్ధంగా ఉన్నారా లేదా ? అన్నది చాలా ముఖ్యం. శృంగారం అంటే శారీరక కలయిక మాత్రమే కాదు. మీ భాగస్వామితే మనస్పూర్తిగా ఏకాంతంగా గడపడం. తనని మీలో, మిమ్మల్ని తనలో ఐక్యం చేసుకోవడం. అది ఓ ఎమోషనల్ ప్రక్రియ. మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడానికి మీరు ఏమాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, భయపడుతున్నా ముందుకు వెళ్లకపోవడమే మంచిది. మీ భాగస్వామితో మీ పరిస్థితిని వివరించి ఆమె సహకారం తీసుకోవడం ఉత్తమం.
జీవిత భాగస్వామి ఇష్టాలను తెలుసుకోండి: మగాళ్లలో భయాలు ఉన్నట్టుగానే స్త్రీలలో కూడా భయాలు ఉంటాయన్న సంగతిని గుర్తెరగడం మంచిది. మీ జీవిత భాగస్వామి కూడా మీతో శృంగారానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అన్నది అడిగి తెలుసుకోండి. తనలో ఇంకా భయాలు ఉంటే పోగొట్టేందుకు ప్రయత్నించండి. ఇద్దరూ సిద్ధంగా ఉన్నప్పుడే సెక్స్ లో పాల్గొనండి.
శృంగారం తీరును మార్చుకోండి: చాలా మంది మగాళ్లు ఒకేరకమైన శృంగారాన్ని ఫాలో అవుతుంటారు. స్త్రీ కింద ఉండి, పురుషుడు పైన ఉండటం అనేది ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. అయితే శృంగార పద్ధతులను మార్చినప్పుడే అసలు సిసలు మజాను అనుభవించొచ్చు. ఓరల్ సెక్స్, వెజినల్ సెక్స్, యానల్ సెక్స్ వంటి పద్ధతులతో శృంగారాన్ని ఆస్వాదించండి. అయితే వీటికి ముందుగా మీ భాగస్వామిని అడిగి పాటించడం ఉత్తమం. వారికి ఇష్టం లేకుంటే అర్థం అయ్యేట్టు చెప్పడం ఆ తర్వాతే పాటించడం మంచిది.
ఫోర్ ప్లే: ఇప్పటికీ చాలా మంది మగాళ్లు మొరటుగా వ్యవహరిస్తుంటారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా..? అన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. శృంగారాన్ని స్టార్ట్ చేసిన మొదటి క్షణంలోనే అసలు కార్యాన్ని మొదలు పెట్టేస్తారు. అయితే అది జీవిత భాగస్వామికి సంతృప్తిని ఇవ్వదని అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ సెక్స్ కంటే మందు ఫోర్ ప్లే తో వీలయినంత ఎక్కువ సేపు గడపండి. జీవిత భాగస్వామిలో శృంగార వాంఛలను రేకెత్తించండి. టాప్ లెవల్లోకి సెక్స్ వాంఛ వచ్చిన తర్వాతే నేరుగా రతిని జరపండి. అప్పుడే మగాళ్లతోపాటు స్త్రీలు కూడా సంతృప్తిని అనుభవిస్తారు.
భాగస్వామితో మాట్లాడండి: కొంత మంది మగాళ్లు ఏదో మొక్కుబడిగా శృంగారం తంతును పూర్తి చేస్తుంటారు. అది మంచి పద్దతి కాదు. శృంగారం చేస్తూ మీ భాగస్వామితో మాట్లాడండి. మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే మీ భాగస్వామితో చెప్పి సెక్స్ పద్ధతిని మార్చండి. తన భావోద్వేగాలను మీతో పంచుకోమని చెప్పండి. మీ భాగస్వామికి ఏమైనా అసౌకర్యంగా అనిపించినా వెంటనే పరిస్థితిని చక్కదిద్దుకోండి. ఇద్దరూ శృంగారం సమయంలో కంఫర్ట్ గా ఉన్నారా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. అప్పుడే శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు.