జపాన్ ప్రజలు ఎక్కువగా కూరగాయలు తింటున్నారు. వాటిలో పోషకాలు చాలా ఎక్కువ. పైగా మన బాడీ నుంచీ విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ అనేవి కూరగాయలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. బ్రకోలీ, కాలీఫ్లవర్, కాలే, మొలకలు, చైనీస్ క్యాబేజీ వంటివి ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి. వాటిలోని విటమిన్ సీ, ఫైబర్ వంటివి అధిక బరువును తగ్గిస్తున్నాయి. తక్కువ మంటలో (సిమ్) ఉడికించి తినడం వల్ల... వంటల్లో పోషకాలు పోకుండా ఉంటున్నాయి.
జపాన్ ప్రజలు సముద్ర ఆహారం ఎక్కువగా తింటున్నారు. చేపల్ని బాగా తింటారు. చేపల్లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని అధిక బరువును తగ్గిస్తాయి. పొట్ట సమస్య, నడుం చుట్టూ ఉన్న కొవ్వును వదిలిస్తాయి. బ్రెయిన్ చురుకవుతుంది. గుండెకు మేలు. పైగా ముసలితనం రాకుండా కూడా చేస్తాయి. స్కిన్‌ని కాపాడతాయి. జుట్టు ఊడిపోకుండా చాలా మేలు జరుగుతుంది. అందుకే సముద్ర చేపలు ఎక్కువగా తినాలంటున్నారు జపాన్ ప్రజలు.
జపాన్ ప్రజలు రెడ్ మీట్ తక్కువగా తింటున్నారు. ఇందులోని కొవ్వు... మన శరీరంలో తిష్టవేసి... బరువు పెరిగేలా చేసి... గుండె పోటు, ఇతర హార్ట్ సమస్యలు వచ్చేలా చేస్తోంది. బేకింగ్ చేసిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రై చేసిన ఫుడ్‌లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఎంత తక్కువ తింటే అంత మంచిదంటున్నారు జపాన్ ప్రజలు. వాళ్లైతే ఈ రూల్ వంద శాతం పాటిస్తున్నారు.