లెగ్యూమ్ జాతి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కూరగాయలు, పండ్ల జాతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జాగింజలు : ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గోధుమపిండి : గోధుమగింజల్లో నాలుగింతలు ఫైబర్ ఉంటుంది. శనగలు : శనగల్లోనూ ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.