అందరూ చెప్పినట్టు పిల్లలు పుట్టినప్పుడే తండ్రి కూడా పుడతాడు. కాబట్టి, పిల్లలతో బెస్ట్ డ్యాడ్ అనిపించుకోవాలంటే వారితో చిన్ననాటి నుంచి ఉండే సాన్నిహిత్యం మీద ఆధారపడి ఉంటుంది.
2/ 10
మీకు చదువుకునే పిల్లలు ఉంటే వారికి హోం వర్క్‌లో సాయం చేయండి.
3/ 10
పిల్లలు అడిగే ప్రశ్నలకు ఏదో ఓ సమాధానం ఎప్పుడూ చెప్పకూడదు. తెలిస్తే అసలైన సమాధానం చెప్పాలి. తెలియకపోతే తెలుసుకుని చెబుతానని చెప్పాలి. ఏదో నోటికి వచ్చిన ఆన్సర్ చెప్పేయకూడదు.
4/ 10
ఎప్పుడూ ఇంట్లో అమ్మే వంట చేస్తుంది. కానీ, డాడీ వంట చేస్తేఎలా ఉంటుందో వారికి తెలియాలి.
5/ 10
మీరు నలభీముడు స్థాయిలో కుక్ చేయాల్సిన పనిలేదు. రెండు బ్రెడ్ స్లైడ్స్ తీసుకుని చిన్నగా శాండ్ విచ్ చేసి ఇచ్చినా కూడా పిల్లలకు అది చాలా రోజుల పాటు గుర్తుంటుంది. కాబట్టి, అప్పుడప్పుడు అలాంటివి ట్రే చేస్తూ ఉండండి.
6/ 10
బయటకు వెళ్లడం అనేది పిల్లలకు అత్యంత ఇష్టమైన వాటిల్లో ఒకటి. అది ఆడుకోవడానికైనా కావొచ్చు. లేకపోతే ఊరికే సరదాగా తిరగడానికైనా కావొచ్చు.
7/ 10
అప్పుడప్పుడు కుటుంబంతో కలసి టూర్లు వేయండి. ట్రావెలింగ్ ద్వారానే వారికి ప్రపంచం తెలుస్తుంది. వాళ్లు ఉండే ఊరిలో కనిపించని కొత్త కొత్త విషయాలు అక్కడ కనిపిస్తుంటాయి. వాటి గురించి వాళ్లు తెలుసుకుంటూ ఉంటారు. నాన్న భుజాల మీద నుంచి ప్రపంచాన్ని చూడడం వాళ్లు అలాంటి సందర్భాల్లోనే నేర్చుకుంటారు.
8/ 10
సమయం సందర్భం ఉన్నప్పుడే కాదు. సడన్‌గా ఓ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారంటే మీరు మీ పిల్లలకు బెస్ట్ డాడ్ అయినట్టే.
9/ 10
చదువుతో పాటు క్రియేటివిటీ కూడా నేర్పొచ్చు. మీకు వచ్చిందే వాళ్లకు నేర్పండి. మీలో ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది కదా. అదే నేర్పండి. అది పెయింటింగ్ కావొచ్చు. మ్యూజిక్ కావొచ్చు.
10/ 10
పిల్లలు అడిగినవన్నీ ఇస్తే బెస్ట్ డాడ్ అయిపోయినట్టే కాదు. ఏది మంచిది? ఏది చెడు అనే విషయాన్ని తెలియజెప్పి వాళ్లను సన్మార్గంలో నడిపే వాళ్లే అసలైన బెస్ట్ డాడ్.