Weight Loss: ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్.. తింటే ఎన్నో బెనిఫిట్స్
Weight Loss: ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్.. తింటే ఎన్నో బెనిఫిట్స్
Fruits for Weight Loss: తెలియకుండానే చాలామంది బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి వారు తిరిగి ఆ బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే... కొన్ని పండ్లను తినడం ద్వారా బరువు తగ్గొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లేంటో తెలుసుకుందాం.
బొప్పాయి... యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ పండుని తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గి సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండు ముక్కలపై కాసింత మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల మరింత ప్రమోజనం... ఒక 2, 3 నెలలు బొప్పాయిపండు తిని చూడండి... తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు డాక్టర్లు.
2/ 5
రేగుపండ్లు... విటమిన్ సి, ఫైబర్ కలిగి ఉన్న ఈ పండ్లు బరువు తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు... కాకపోతే ఇవి అన్ని కాలాలలో లభించవు... ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి.
3/ 5
స్ట్రాబెర్రీస్ : విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని తేలింది. అంతేకాదు, ఈ పండ్లు కాన్సర్ కారకాలతో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
4/ 5
ఆపిల్స్ : రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.
5/ 5
ద్రాక్ష : పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు కూడా బరువుని సులభంగా తగ్గిస్తాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు... దాహార్తిని కూడా తీరుస్తాయి.