హాలిడే ట్రిప్ కోసమో, వేకేషన్కో వెళ్లినప్పుడు... చాలా మంది బరువు సంగతి మర్చిపోతారు. కేలరీల సంగతి పట్టించుకోకుండా... మనకు నచ్చినవి తినేస్తారు. రుచికరమైన వంటకాల్నీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాకొలెట్స్... ఇలా లిమిట్ లేకుండా తీసుకుంటారు. తీరా వేకేషన్ పూర్తై... తిరిగి ఇంటికి రాగానే... బరువు మరింత పెరిగిన విషయం అర్థమవుతుంది. అలాగని జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చెయ్యాలంటే ఆసక్తి ఉండదు. మరి పెరిగిపోతున్న బరువును తగ్గించుకోవడమెలా... ఇలాంటి పరిస్థితి రాకుండా... అసలు వేకేషన్లోనే కొవ్వు కరిగించుకునే టిప్స్ ఉన్నాయి. వాటి వల్ల జిమ్‌కి వెళ్లకుండానే... అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అందుకోసం కింది విధంగా చెయ్యండి.
ఆల్కహాల్ తగ్గించండి : చాలా మంది హాలిడేకి వెళ్లగానే... మద్యం తాగేస్తుంటారు. దాని వల్ల అన్నీ అనర్థాలే. మందు బదులు... ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం ఎంతో మేలు. అవి ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు... ఆకలిని తగ్గిస్తాయి. ఎక్కువ ఆహారం తినకుండా చేస్తాయి. పైగా... పండ్లు, పండ్ల రసాలు... మన శరీర కొవ్వును కరిగిస్తాయి కూడా.
బీచ్‌లో ఆడండి : బీచ్‌కి వెళ్లగానే చాలా మంది అక్కడ అలా పడుకుంటారు. దాని బదులు ఇంకా చాలా చెయ్యొచ్చు. వాలీబాల్ ఆడొచ్చు. ఇసుకలో గెంతొచ్చు. రోడ్డుపై కంటే ఇసుకలో నడవడం చాలా కష్టం. కాబట్టి... ఇసుకలో నడవాలంటే మనం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అందువల్ల ఇసుకలో నడిచేవారికి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇక ఇసుకలో ఆడితే మరింత ఎక్కువ బరువు తగ్గొచ్చు.