Home » photogallery » life-style » FASHION DESIGNER REHANA BASHEER FASHION DESIGNS NK

Pics : ఫ్యాషన్‌కి కొత్త అర్థం చెబుతున్న రెహనా బషీర్

Rehana Basheer : ఫ్యాషన్ డిజైనర్లలో రెహనా బషీర్ ప్రత్యేకం. సంగీత్, మెహందీ, మ్యారేజ్... ఈవెంట్ ఏదైనా సరే... చెన్నైలోని ఆమె బొటిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరుగున పడిపోతున్న అనార్కలీ డిజైన్స్‌‌ని మళ్లీ ప్రపంచానికి గుర్తుచేశారామె. 2001లో క్లాత్స్ డిజైన్ ప్రారంభించిన రెహనా బషీర్... క్రమంగా డెవలప్ అవుతూ వచ్చారు. తన క్రియేటివిటీకి పదునుపెట్టి... వైవిధ్యభరితమైన డిజైనింగ్స్ తయారుచేశారు. ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయిపోకుండా... తనే స్వయంగా ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేయిస్తున్న లెహంగాస్, ఇండో-వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్, షరారాస్, లైట్ ట్రౌజర్స్ అందర్నీ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె... రోజుకు 30 నుంచీ 50 దాకా డిజైన్స్ సృష్టిస్తున్నారు. 18 ఏళ్లుగా చాలామంది సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు ఆమె డ్రెసెస్ డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం 124 మంది ఆర్టిస్టులు, ఉద్యోగులూ... ఆమె బొటిక్ ద్వారా ఉపాధి పొందుతున్నారు.