సిద్దివినాయక దేవాలయం, ముంబై: ముంబైలో ఉన్న సిద్దివినాయక దేవాలయం చాలా ప్రముఖమైనది. 1801లో నిర్మించిన ఈ ఆలయానికి ముంబైలోని సామాన్యల నుంచి సెలెబ్రిటీల వరకు తరచూ వెళ్తుంటారు. కోరికలు తీర్చే దేవుడని సిద్దివినాయకుడికి పేరు. ఈ దేవాలయానికి విరాళాలు, ఆస్తులు చాలా ఎక్కువ. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియాకు వచ్చినప్పుడు తన పర్యటనను ఇక్కడి నుంచే ప్రారంభించారు.(Image: Shutterstock)
దగ్దుసేథ్ హల్వాయ్ గణపతి టెంపుల్, పూణే: పూణేలో ఉన్న దగ్దసేథ్ హల్వాయ్ గణపతి దేవాలయంలో 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న వినాయకుడి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహానికి రూ. 1కోటి బీమా ఉన్నది. లోకమాన్య తిలక్ స్నేహితుడు దగ్దసేథ్ ఈ విగ్రహానికి ఇన్స్యూరెన్స్ చేయించారు. ప్రతీ ఏడాది గణేష్ మహోత్సవాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. (Image: Shutterstock)
కాణిపాకం వినాయక దేవాలయం, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వినాయక దేవాలయం 1000 ఏళ్ల క్రితమే నిర్మించిన పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని చోళ రాజు కులుతుంగ చోళ-1 నిర్మించారు. ఈ దేవాలయంలో ఉన్న విగ్రహం ప్రతీ రోజు ఎత్తు పెరుగుతూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయ ఆవరణలో ఉన్న స్వయంభు బావి ఎప్పుడూ ఎండిపోకుండా ఉంటుంది.