జాతీయ పక్షి నెమలి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలు
ఒక్కక్షణం నెమలిని చూస్తే అర్థమవుతుంది ప్రకృతి రమణీయత ఎంతటిదో.. విశ్వంలోని అందాన్నంతా తనలో దాచుకున్న నెమలిని భారతప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది. 1963లో జనవరి 31న ఈ ప్రకటన జరిగింది. అంటే నేటికి సరిగ్గా 50ఏళ్లు పూర్తైందన్న మాట.. ఈ సందర్భంగా ఆ మయూరం గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి.
రానురాను తగ్గుతూ వస్తున్న నెమళ్ల సంఖ్య. 2011తో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో జీవిస్తున్న నెమళ్లు.
2/ 10
వేటగాళ్ల దెబ్బకు నెలకు దాదాపు 10 నుంచి 20 నెమళ్లు ప్రాణాలు విడుస్తున్నాయి.
3/ 10
నెమళ్లు సాధారణంగా అటవీప్రాంతంలో 20సంవత్సరాలు బతుకుతాయి. వీటిన ప్రత్యేక శ్రద్ధతో పెంచితే.. 40 నుంచి 50 సంవత్సరాలు ఢోకా లేకుండా చక్కగా జీవనకాలాన్ని పెంచొచ్చు.
4/ 10
కొన్ని నెమళ్లు తెలుపు రంగులోనూ ఉంటాయి. వీటినే శ్వేత మయూరాలంటారు.
5/ 10
ఆహారంగా ధాన్యపు గింజలు, పండ్లు, క్రిమికీటకాలు, చిన్నపాములు, పురుగులను తీసుకునే నెమళ్లు.
6/ 10
ఆడ నెమళ్లు 96 సెంటీమీటర్ల దాకా పొడవు, 4 కిలోల బరువు ఉంటాయి.
7/ 10
మగ నెమళ్లు 2. 12 మీటర్ల పొడవు, 5 కిలోలకు పైగా బరువుంటాయి.
8/ 10
ఆడనెమళ్లు రెండేళ్ల నుంచి రోజుకొక గుడ్డు 10రోజుల పాటు పెడతాయి.
9/ 10
గుడ్లని పొదగడానికి 30 రోజుల సమయం తీసుకుంటాయి.
10/ 10
వేసవిలో మాత్రం నెమలికి ఈకలు రాలిపోవడమే కాకుండా గుడ్లను పొదిగే అవకాశం కూడా ఉండదు.