అందం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగి ఎంతో ఖర్చు పెడుతుంటారు. అయితే... కొన్ని స్టెప్స్ తెలుసుకుంటే ఆ ఫేషియల్ ఏదో ఇంట్లోనే చేసుకోవచ్చు... పైగా సహజసిద్ధ పదార్థాలతో ఫేషియల్ చేస్తుంటాం కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..
2/ 6
క్లీనింగ్... ఫేషియల్ చేయడానికి ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కాటన్ టవల్‌తో ఫేస్‌ని తుడిచేయాలి.
3/ 6
స్టీమింగ్... ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసి వేడి చేయాలి.. ఇందులో ఓ గ్రీన్ టీ బ్యాగ్ వేసి మరిగించి ఆ నీటితో ఆవిరి పట్టాలి.
4/ 6
స్క్రబ్బింగ్... ఒక స్పూన్ తేనెలో అంతే పరిమాణంలో పంచదార కలిపి ఆ మిశ్రమంతో ముఖంపై రుద్దుతూ 2నిమిషాలు మసాజ్ చేసి చల్లని నీటితో కడిగేయాలి.
5/ 6
మాస్క్... ఇప్పుడు జిడ్డు చర్మం వారు శనగపిండిలో పెరుగు, పసుపు కలిపి ఆ మిశ్రమం మాస్క్‌లా వేయాలి. అదే పొడిచర్మమైతే ఓట్ మీల్లో పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. కళ్లపై కీరదోస ముక్కల్ని పెట్టుకోవాలి. మాస్క్ ఆరాగానే చల్లని నీటితో కడిగేయాలి.
6/ 6
చివరగా బాదం, జొజొబో ఆయిల్ కానీ, అలోవెరా జెల్‌తో మసాజ్ చేయాలి.ఇలా 15 రోజులకొకసారి ఫేషియల్ చేయడంతో ముఖం నిగారింపుని సంతరించుకుంటుంది. అయితే.. మాస్క్‌ని అరటిపండ్లు, ఆరెంజ్, కాంబినేషన్స్‌తో కూడా వేసుకోవచ్చు.