Cashew for Diabetes : ఈ రోజుల్లో అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలు. ప్రశాంతంగా ఇంట్లో వండుకునే ఆహారం తినే వీలు లేదు. అందుకే చాలా మంది ఫుడ్ డెలివరీ యాప్‌లను వాడేస్తున్నారు. కొంతమంది రెస్టారెంట్లలో తింటున్నారు. ఇలా బయటి ఆహారం తినడం వల్ల.. ఉప్పు ఎక్కువై హైబీపీ.. కొవ్వు ఎక్కువై డయాబెటిస్ వంటి అనారోగ్యాలు వస్తున్నాయి.
ఫాస్ట్‌ఫుడ్ వండేవారు కావాలనే కాస్త ఉప్పు ఎక్కువ వేస్తారు. ఫలితంగా రుచి బాగుంటుంది. ఆ ఫుడ్‌కి అలవాటు పడేవారు.. మళ్లీ మళ్లీ వెళ్లి అవే తింటారు. క్రమంగా వారి ఆరోగ్యం చెడిపోతుంది. కిడ్నీలు పాడవుతాయి. హైబీపీ, షుగర్ వంటివి వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మందికి పైగా డయాబెటిస్ ఉంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఉన్నవారిలో.. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు లేదా దానిని సమర్థవంతంగా ఉపయోగించదు. మధుమేహం నియంత్రణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నట్స్ బెస్ట్ సూపర్ ఫుడ్. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.