ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం పెద్ద బిల్డప్‌గా మారింది. సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై రాసే హెచ్చరికలను మనం ఏమాత్రం పట్టించుకోం. డాక్టర్లు ఎంత చెబుతున్నా వినిపింంచుకోం. ఇవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిసినా వాటినే తింటున్నాం. Image source Pexels
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రోజన్ మీల్స్, క్యాన్డ్ ఫుడ్ లాంటి వాటిలో సోడియం అత్యధికంగా ఉంటుంది. డోనట్స్, ఏరేటెడ్ డ్రింక్స్ లాంటివాటితో పాటు వైట్ రైస్, పాస్టా, మైదాలోనూ ఇది అధికం. బ్రెడ్, సమోసా, పికిల్స్, ఫిజ్జీ డ్రింక్స్, కార్న్ ఫ్లోర్, కేక్స్, టమోటా కెచప్, టార్ట్స్, పిజ్జాల్లో కూడా ఇన్ల్ఫమేటరీ కారకాలు అత్యధికం. Image source Pexels
ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అకాల మరణాల కూడా సంభవిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, కరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ ప్రమాదాలు 10శాతం కంటే ఎక్కువ పెరుగుతాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. Image source Pexels