Photos : పుచ్చకాయలు ఎక్కువగా తింటున్నారా.. ఈ 5 సమస్యలు వస్తాయి
Photos : పుచ్చకాయలు ఎక్కువగా తింటున్నారా.. ఈ 5 సమస్యలు వస్తాయి
Watermelon side effects : ఎండాకాలం.. అందులోనూ ఇండియాలో ఎండాకాలం అంటే చాలా వేడిగా ఉంటుంది. విపరీతంగా దాహం వేస్తుంది. పైగా ఎనర్జీ లెవెల్స్ వేగంగా పడిపోతుంటాయి. అందువల్ల సుక్రోజ్ ఉండే పండ్లను ఎక్కువగా తీసుకుంటాం. వాటిలో పుచ్చకాయ.. సమ్మర్ ఫ్రూట్. మరి దీన్ని ఎక్కువగా తీసుకుంటే కలిగే 5 నష్టాలేంటో తెలుసుకుందాం.
Watermelon : పుచ్చకాయలు తియ్యగా, రుచికరంగా ఉంటాయి. వాటి కలర్ కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. సమ్మర్లో రోడ్లపై పుచ్చకాయను ముక్కలు చేసి.. ఐస్ పెట్టి మరీ అమ్ముతారు. అందువల్ల ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటాం. ఐతే.. ఏదైనా పరిమితి దాటితే ప్రమాదమే. పుచ్చకాయను అతిగా తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.
2/ 10
Nutritional Facts : 100 గ్రాముల పుచ్చకాయలో 30 కేలరీలు ఉంటాయి. అలాగే సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, షుగర్, ప్రోటీన్, విటమిన్ C, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, కొద్దిగా ఫ్యాట్ ఉంటాయి.
3/ 10
Health Benefits : పుచ్చకాయ తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. కంటి చూపు మెరుగవుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండెకు మేలు జరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. చర్మం తేమగా ఉంటుంది. రకరకాల వ్యాధులు రావు. మరి.. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.
4/ 10
Upset stomach : పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల పుచ్చకాయను ఎక్కువగా తింటే.. కడుపులో తేడా చేస్తుంది. పొట్ట ఉబ్బుతుంది. విరేచనాల సమస్య వస్తుంది. కాబట్టి అతిగా తినకపోవడం మేలు.
5/ 10
Lycopene overdose : పుచ్చకాయల్లో లైకోపీన్ (lycopene) అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. దీని వల్ల ఆ పండు ఎరుపు రంగులో ఉంటుంది. సాధారణంగా లైకోపీన్ మనకు ఆరోగ్యకరమే., ఐతే.. ఇది ఎక్కువైతే మాత్రం.. వికారం, విరేచనాలు, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి.
6/ 10
Allergic reaction : కొంతమందికి పుచ్చకాయలు పడవు. అలర్జీ వస్తుంది. దురద, పొక్కులు, నీటి కురుపులు, అతిగా చెమట పట్టడం, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు పుచ్చకాయ వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
7/ 10
High blood sugar : డయాబెటిస్ పేషెంట్లు పుచ్చకాయను వాడాలో వద్దో డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 72 ఉంటుంది. GI 55 కంటే తక్కువ ఉన్న వాటినే డయాబెటిస్ బాధితులు వాడొచ్చు. పుచ్చకాయను వాడితే.. షుగర్ లెవెల్స్ చాలా వేగంగా పెరుగుతాయి.
8/ 10
Interference with medication : మనం వాడే మందులను పుచ్చకాయ ప్రభావితం చేస్తుంది. హైబీపీ ట్రీట్మెంట్లో ఇచ్చే బీటా బ్లాకర్స్ను పుచ్చకాయలు ప్రభావితం చేసి... రక్తపోటును బాగా తగ్గించేయగలవు. ఫలితంగా కళ్లకు మసక, కళ్లు తిరగడం వంటి సమస్యలు రాగలవు.
9/ 10
మొత్తంగా పుచ్చాకాయలను ఓ పరిమితి విధించుకొని మాత్రమే తినాలి. అప్పుడే దాని వల్ల ఆరోగ్య ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువగా తింటే.. ఆరోగ్యం సంగతేమో గానీ అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
10/ 10
Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.