Health Tips: ఉదయాన్నే నిద్రలేవగానే ఒక టీ స్పూన్ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Health Tips: ఉదయాన్నే నిద్రలేవగానే ఒక టీ స్పూన్ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Health Tips: ఉదయాన్నే కాళీ కడుపుతో నెయ్యి తింటే కడుపుతో పాటు పేగులు శుభ్రపడట మాత్రమే కాదు తల వెంట్రుకల్లో పటుత్వం పెరిగి చుండ్రును అరికట్టడానికి దోహదపడుతుంది. ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందని కొందరు, మొటిమలు వస్తాయని ఇంకొందరు చెప్పడం ఎక్కువగా వింటూనే ఉంటాం. కాని పౌష్టికాహార నిపుణులు మాత్రం నెయ్యి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా పరగడుపున అంటే నిద్రలేవగానే ఒక టీ స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలు అనేకమంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
ఉదయాన్నే నిద్ర లేవగానే నెయ్యి తినమంటే అమ్మో అంటూ భయపడే వాళ్లు ఇప్పటికి ఉన్నారు. కాని న్యూట్రిషన్స్ మాత్రం హ్యాపీగా తినవచ్చంటున్నారు. అంతే కాదు ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఎంతగానో మెరుగుపడి పేగులు శుద్ధి చేయబడతాయంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
అంతే కాదు టీ స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్లే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటమే కాదు మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
ముఖ్యమమైన విషయం ఏమిటంటే నెయ్యి తింటే ఫ్యాట్ పెరిగి లావు అవుతారనే మాట సరికాదంటున్నారు నిపుణులు. నెయ్యితో ఆకలి అదుపులో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయంట. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
ఉదయాన్నే కాళీ కడుపుతో నెయ్యి తింటే కడుపుతో పాటు పేగులు శుభ్రపడట మాత్రమే కాదు తల వెంట్రుకల్లో పటుత్వం పెరిగి చుండ్రును అరికట్టడానికి దోహదపడుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, తల దురద తగ్గుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
అంతే కాదు నెయ్యిని కొవ్వు పదార్ధారంగా చూసే వాళ్లు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఉదయాన్నే ఓ స్పూన్ నెయ్యి తినడం వల్ల చర్మంపా ముడతలు, మొటిమలు తగ్గిపోయి కాంతివంతంగా మారుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
ఉదయాన్నే లేవగానే ఓ టీ స్పూన్ నెయ్యి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముక్కు, గొంత, ఛాతి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
క్రమం తప్పకుండా రోజూ లేవగానే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. విసర్జక వ్యవస్థ కూడా యధావిధిగా పని చేస్తుందంటున్నారు న్యూట్రిషన్లు. (ప్రతీకాత్మకచిత్రం)