Eat Fish: చలికాలంలో చేపలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెడతారు..

శీతాకాలంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. బాక్టీరియా వల్ల తరచుగా వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. అందుకే, మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్​లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం ఈ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. అన్ని రకాల అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించే ఆహారం చేప. చలికాలంలో చేపలను ఎందుకు తినాలో తెలుసుకుందాం.