పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి పెరుగు చాలా అవసరం. ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ప్రొటీన్లు, విటమిన్ బి6, బి12, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గ్యాస్ సంబంధిత సమస్యల నుంచి పెరుగు ఉపశమనం కలిగిస్తుంది.