పూర్వం నగరాలు తక్కువగా ఉండేవి కాబట్టి కాలుష్యం తక్కువగా ఉండేది. అందువల్ల ఆటోమేటిక్‌గా ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు పొల్యూషన్ కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. మరి మన ఆరోగ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచే, ఇంట్లో పెంచుకునే ఆ ఔషధ మొక్కలేవో తెలుసుకుందాం. వాటి ఆకులు, పూలు, గింజలను కూరల్లో, టీలలో, సూప్‌లలో వాడటం ద్వారా ఆరోగ్యం పెంచుకోవచ్చు. (credit - twitter)
శతవారీ (Shatavari) : ఇదో ఆయుర్వేద మొక్క. సైంటిఫిక్‌గా ఆస్పర్గస్ రేమ్సోసస్ (Asparagus racemosus) అంటారు. ఇది ఒత్తిడి, టెన్షన్లను తగ్గిస్తుంది. బాడీలోకి విష వ్యర్థాల్ని రానివ్వదు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. డయేరియాను ఆపేస్తుంది. చాలా తేలిగ్గా పెరిగే మొక్క ఇది. (credit - twitter - nethu amanda)