మంచి మటన్ ఎప్పుడూ పాలిపోయినట్లుగా ఉండదు.. జ్యూసీగా ఉంటుంది. ఇలా చూసి తీసుకోవాలి. రక్తం, నీరు కారుతుంటే వాటిని తీసుకోకూడదు. ముఖ్యంగా ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటే అందులో కొవ్వు అధికంగా ఉన్నట్లు గుర్తించాలి. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉన్న మటన్ ఎప్పుడూ మంచిదే. చాలామంది బోన్‌లెస్ మటన్‌ని ఎక్కువగా తింటారు. అలా కాకుండా బోన్‌తో ఉన్న మటనే రుచిగా ఉంటుంది. పైగా ఆ మటన్ త్వరగా ఉడుకుతుంది కూడా. సాధ్యమైనంతవరకూ ఆన్లైన్లో మటన్ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.