చాలామంది వీకెండ్ కానీ, సెలవులు కానీ వచ్చినప్పుడు చక్కగా ఎటైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ జర్నీ హ్యాపీగా ఉంటుంది.
జర్నీ అనగానే చాలామంది అలసటగా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారు నిమ్మరసంని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
2/ 5
టూర్ చేసే సమయంలో నిద్రపోరు. అలా చేయడం వల్ల మీరు త్వరగా అలిసిపోతారు. అలా కాకుండా.. కావాల్సినంతా పోద్రపోవడం వల్ల హ్యాపీగా టూర్‌ని ఎంజాయ్ చేస్తారు.
3/ 5
అలానే నీరు, లిక్విడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసట, తలనొప్పి దరిచేరవు.
4/ 5
రోజంతా తిరుగుతుంటారు కాబట్టి తలనొప్పి, కంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రి పడుకునేముందే గోరువెచ్చని ఆయిల్ తీసుకుని తలకు రాసి మసాజ్ చేయాలి. అదే విధంగా.. కళ్ళపై రాసి గుండ్రగా మర్దనా చేస్తే సమస్య తగ్గుతుంది.
5/ 5
ప్రయాణ సమయాల్లో డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఇబ్బంది పెట్టే డ్రెస్సింగ్ కంటే కంఫర్ట్, తేలిగ్గా ఉండే బట్టలను వేసుకోవడం వల్ల హాయిగా ఫీలవుతారు.