DONT BRUSH YOUR TOOTH MORE THAN TWO TIMES A DAY IF YOU BRUSH MORE IT WILL DAMAGE YOUR TEEATH SK
Teeth Brushing: రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఎక్కువగా తోమితే డంజరని తెలుసా?స్యలు
Tooth Brushing Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే మన పళ్లను బ్రష్ చేస్తాం. ఆ తర్వాతే ఇతర పనులను చేస్తాం. ఇక రాత్రి భోజనం తర్వాత కూడా కొందరు పళ్లను తోముతుంటారు. కానీ ఇంకొందరు ఉదయం, రాత్రి కాకుండా మధ్యమధ్యలో కూడా బ్రష్ చేస్తారు. అలా చేయడం మంచిది కాదని తెలుసా..?
భోజనం ముగించిన ప్రతి సారీ బ్రష్ చేయడం మనలో కొంత మందికి అలవాటు. కానీ అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
2/ 5
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం, రాత్రి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
3/ 5
ఎక్కువ సార్లు బ్రష్ చేసినా.. ఎక్కువ సేపు పళ్లు తోమినా.. పళ్ల పైపొర ఎనామిల్ దెబ్బతింటుంది. అది సెన్సిటివిటీ, దంతక్షయానికి దారితీస్తుంది. హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ చిగుళ్ళని డ్యామేజ్ చేస్తుంది.
4/ 5
కాఫీ, టీ, శీతల పానీయాలు సేవించిన తర్వాత సాప్ట్‌గా బ్రష్ చేయడం మరచిపోవద్దు. ఎందుకంటే వాటిలో ఉండే ఆమ్లాలు పళ్ల పైపొరను దెబ్బతీస్తాయి. క్రమంగా పళ్లు పుచ్చిపోయేందుకు కారణమవుతాయి.
5/ 5
రాత్రి భోజనం చేసిన వెంటనే పళ్లు తోమకూడదు. ఒక అరగంట గ్యాప్ తర్వాత బ్రష్ చేయడం ఉత్తమం. అప్పుడే పళ్లపై యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.