ఏదైనా కూర చేసేటప్పుడు దానికి అవసరమైన పదార్థాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేగానీ ఫ్రిజ్ నుంచి టమోటా ఒకసారి, పచ్చి మిర్చి ఒకసారి.. తీసుకురాకూడదు. ఇలా చేస్తే మీకు తెలియకుండానే ఎక్కువ సమయం పాటు గ్యాస్ ఖర్చవుతుంది. అందుకే ఏదైనా వంట చేసే ముందు దానికి అవసరమయ్యే పదార్థాలన్నింటినీ ముందే సిద్ధం చేసుకోవడం ఉత్తమం. (ప్రతీకాత్మక చిత్రం)
వంట త్వరగా కావాలని చాలా మంది పెద్ద మంటపైనే ఉడికిస్తారు. కానీ అలా చేస్తే ఎక్కువ గ్యాస్ వృథా అవుతుంది. మీడియం మంటపై వంటలను చేసుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది. అంతేకాదు కూరగాయలను నేరుగా ఫ్రిజ్ నుంచి చల్లచల్లగా తీసుకొచ్చి వంట చేయకూడదు. గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాతే వంట చేయాలి. లేదంటే అవి ఉడికేందుకు ఎక్కువ సమయం పట్టి.. గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే సాధారణంగా 4 నెలలు వచ్చే గ్యాస్ 6 నెలల వరకు వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)