డాల్ఫిన్ల మేథస్సుకు సంబంధించి ఇప్పటికే పలు పరిశోధనలు జరిగ్గా..మరికొన్ని జరుగుతున్నాయి. ఫ్లోరిడాలో నిర్వహించిన తాజా పరిశోధనల్లో అవి టీవీని చూడడం ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది.
1/ 9
సముద్ర జీవరాశుల్లో అత్యంత తెలివితేటలు కలిగిన ప్రాణులుగా డాల్ఫిన్లకు గుర్తింపు ఉంది. డాల్ఫిన్ల మేథస్సుకు సంబంధించి ఇప్పటికే పలు పరిశోధనలు జరిగాయి. మరికొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.
2/ 9
తాజా అధ్యయనంలో డాల్ఫిన్లకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టమని నిర్ధారణ అయ్యింది. టీవీల ముందు గంటలకొద్ది గడిపేందుకు అవి ఇష్టపడుతున్నాయి.
3/ 9
ఫ్లోరిడాలోని డాల్ఫిన్స్ ప్లస్ మెరైన్ మ్మల్ రెస్పాన్డర్లో పరిశోధకులు డాల్ఫిన్లపై ఈ అధ్యయనం చేశారు. అండర్ వాటర్ విండోస్ ద్వారా టీవీ స్క్రీన్‌ను అమర్చి వీడియోలు ప్రదర్శించారు.
4/ 9
గ్రహాలు, భూమి, ప్రకృతికి సంబంధించిన వీడియోలను ఇందులో ప్రదర్శించగా...ఈ వీడియోలను డాల్ఫిన్లు ఎంతో ఆసక్తిగా తిలకించాయి.
5/ 9
వీడియోలను తిలకించే సమయంలో డాల్ఫిన్స్ ప్రవర్తను పరిశీలిస్తే అవి చాలా ఎంజాయ్ చేశాయని నిర్ధారణ అయినట్లు పరిశోధకులు తెలిపారు.
6/ 9
కొన్ని డాల్ఫిన్లు వీడియోల కంటే ఫోటోలను టీవీ స్క్రీన్లపై తిలకించేందుకు మక్కువ చూపాయి.
7/ 9
బాటిల్‌నోస్ డాల్ఫిన్లలలో మగవి ఆడవాటి కంటే ఎక్కువ సమయం టీవీలో వీడియోలను తిలకించాయి.
8/ 9
టీవీలో వీడియోలు చూస్తూ కొన్ని సైగల ద్వారా అవి తమ సంతోషాన్ని వ్యక్తపరిచాయని పరిశోధకులు వెల్లడించారు.
9/ 9
డాల్ఫిన్లను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.