When Dogs Yawn: మనకు ఆవలింత వస్తే అలసిపోయాం అని అర్థం. కుక్కలకు అలా కాదు. అవి సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉన్నట్లు ఫీలైతే ఆవలిస్తాయి. కుక్క కంటిన్యూగా 15 సార్లు ఆవలిస్తే, అవి చాలా రిలాక్స్‌గా ఉన్నాయని అర్థం. ఒక్కోసారి మనం వాటిని బయటకు తీసుకెళ్లే టప్పుడు అవి ఆవలిస్తూ ఉంటాయి. అంటే వాటికి బయటకు రావడం ఇష్టం లేదని అర్థం. అది గమనించాలి.
Like A Caterpillar: ఒక్కోసారి కుక్కలు తోక ఊపుతూ... అదే పనిగా మెలికలు తిరుగుతూ మీ చుట్టూ తిరుగుతాయి. ఆ ప్రవర్తన మనకు నవ్వు తెప్పిస్తుంది. కానీ... దానికి దురద పెడుతోందని అర్థం. కొన్నిసార్లు మీ దృష్టిని ఆకర్షించడానికి కూడా అలా చేస్తాయి. ఈ సమయంలో వాటి పొట్టపై చేత్తే నిమరాలి. గడ్డం దగ్గర కూడా నిమిరితే సరిపోతుంది.
Tilting Their Heads: మీ కుక్క కంటిన్యూగా తల కిందకూ, పైకీ ఊపుతోందంటే... దాని అర్థం... మీరు చెప్పే విషయాల్ని అది జాగ్రత్తగా వింటోందని. కుక్కలు మొదట మనుషుల బాడీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంటాయి. ఆ తర్వాత వాళ్లు చెప్పే మాటల్లో కొన్ని కొన్ని పదాల్ని గుర్తుంచుకుంటాయి. అలా అవి భాషను అర్థం చేసుకుంటాయి. చెప్పింది బాగా వినపడాలంటే... అవి తల ఊపాల్సి ఉంటుంది. అందుకే ఊపుతాయి.