Ugadi 2023: ఉగాది పండుగ వచ్చేస్తుంది. చాలా మంది ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండుగ ముందు రోజు నుంచే చేయాల్సిన పనులను నిర్ణయించుకుంటారు. ఇక ప్రతీ పండుగకు అందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తుంటారు. ఇక ఉగాది రోజున తలస్నానం ఎందుకు చేయాలి?
Ugadi 2023: ఉగాది పండుగ వచ్చేస్తుంది. చాలా మంది ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండుగ ముందు రోజు నుంచే చేయాల్సిన పనులను నిర్ణయించుకుంటారు. ఇక ప్రతీ పండుగకు అందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తుంటారు.
2/ 8
మరీ ముఖ్యంగా ఏడాదిలో సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది పెద్ద పండుగలుగా చెప్పుకోవచ్చు. ఈరోజున ప్రతీ ఒక్కరు స్నానం చేసి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి భక్తి పారవశ్యంలో ఉంటారు.
3/ 8
అయితే ఉగాది రోజున తప్పనిసరిగా తల స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మరి ఎందుకు తల స్నానం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
4/ 8
సాధారణంగా మనం ప్రతీ రోజు స్నానం చేస్తుంటాం. కానీ వారంలో కొన్నిసార్లు మాత్రమే తలంటూ స్నానం చేస్తారు. కానీ పండుగ రోజైన ఉగాది పర్వదినాన తలంటూ స్నానం చేయాలి.
5/ 8
కాకపోతే ఉగాది రోజు స్నానానికి ముందు స్పెషల్ గా నూనె రాసుకొని చేస్తాం. దీనివల్ల వ్యక్తిలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుందట.
6/ 8
అంతేకాదు నూనె రాసుకోవడం వల్ల తేజస్సు పెరగడమే కాకుండా శరీరంలో జీవశక్తి కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
7/ 8
అలాగే నూనె రాసుకున్న చర్మంపై వేడి నీళ్లు పడడం వల్ల శరీరంపై రక్షణ పొర ఏర్పడుతుంది.
8/ 8
ఇక నూనె రాసి స్నానం చేస్తే మన చర్మం తాజాగా ఉండడంతో పాటు రక్షణ కూడా ఉంటుంది.