(Reasons for sprinkling alcohol)ప్రతి దేశంలో వివిధ సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. తమ పూర్తీకుల కాలం నుంచి ఆచరించేవారుంటారు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అనుసరించే మద్యపాన ఆచారం గురించి తెలుసుకుందాం. దీన్ని లిబేషన్ అని పిలుస్తారు. ఇది మనపెద్దవాళ్లు చేస్తుంటే మనం చూసే ఉంటాం. మరి అలా మద్యం తాగేముందు కింద కాస్త చల్లితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
భారతీయ ఆచారం..
ఇది భైరవనాథునికి పానీయం సమర్పించే చర్య అని నమ్ముతారు. భైరవుడు గోరఖ్‌నాథ్ శిష్యుడు, అతని గురువు మత్స్యేంద్రనాథ్. మన పురాణాల ప్రకారం.. మొత్తం తాంత్రిక సిద్ధులను నియంత్రించే శక్తి అతనికి ఉంది. మద్యం చల్లడం అనేది వ్యక్తి మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకోవాలని, చెడు నుండి అతనిని/ఆమెను రక్షించాలని ప్రార్థనగా పరిగణించబడుతుంది.అందుకే మనదేశంలో ఇలా తాగే ముందు మద్యాన్ని కొద్దిగా కింద చల్లుతారు (Reasons for sprinkling alcohol)
లాజిక్..
ఈజిప్టు, గ్రీస్, రోమ్లలో కూడా ఇదే ఆచారం అనుసరిస్తారు. వారితో లేని ఆత్మల జ్ఞాపకార్థం ఇలా ఆల్కహాల్ చల్లుతారు. క్యూబా, బ్రెజిల్‌లలో, ప్రజలు ఆచారాన్ని నిర్వహిస్తారు. పారా లాస్ శాంటోస్ అని అంటారు, అంటే సాధువుల కోసం. ఫిలిప్పీన్స్‌లో, వారు పారా స యవా అంటారు, అంటే పానీయం డెవిల్కు అంకితం చేయబడింది. (Reasons for sprinkling alcohol)