చేపలను బాగా కడిగి శుభ్రం చేసి ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిని ఓవెన్లో పెట్టి 2 చెంచాల నూనె వేసి కాగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.