How to habituate food to kids: ప్రస్తుత బిజీ షెడ్యూల్ లో తినడానికి కూడా సరైన టైం కేటాయించలేకపోతున్నాం. కానీ, అది ఎంత వరకు మీకు ఒంట పడుతుందో తెలుసా? ఇదే రానురాను మీ పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది. అదే చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు భోజనం ఎలా చేయాలో అలవాటు చేస్తేనే వారికి అలవాడుతుంది. ఇటీవల యూకేలోని ఆస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ మానసిక వైద్యనిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
పిల్లలు పెద్దవాళ్లు అలవాటు చేసే పనులనే అనుకరిస్తారు. ముఖ్యంగా శిశువుగా ఉన్నప్పటి నుంచే అలవడుతుంది. వారికి చిన్పప్పటి నుంచే రుచులను ఆస్వాదించడాన్ని కూడా అలవాటు చేయాలి. అప్పుడే వారు మారం చేయకుండా.. ఆహారపు అలవాట్లను ఆస్వాదిస్తారు. ముఖ్యంగా వాళ్ల ముందు మీకు ఇష్టం లేని ఫుడ్ గురించి చెప్పకూడదు. దీంతో వారు కూడా బాగుండదేమో అనుకుంటారు. నిజంగానే దాని టేస్ట్ బ్యాడ్ గా ఉంటుందేమోనని దాని జోలికే వెళ్లకపోవచ్చు. వారు పెద్దయ్యే సరికి కూడా వారు ఆ వంటను రుచించకపోవచ్చు. How to habituate food to kids
How to habituate food to kids: కేవలం తినే విధానమే కాదు.. ముఖ్యంగా పిల్లలు తినేటప్పుడు వారిని చదువు ఇతర విషయాల గురించి మాట్లాడకూడదు. ఆ సమయంలో వారి దృష్టి కేవలం తిండిపైనే ఉండేలా చూడాలి. వారు ఇష్టంగా ఏ ఆహారం తింటున్నారు? ఏది వద్దని పక్కనబెడుతున్నారో కూడా తల్లిదండ్రులు గ్రహించాలి. ఎందుకంటే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారికి ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని అందించడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత.
ఒకవేళ వారు పక్కన పెట్టే ఆహారం రోగనిరోధక శక్తిని పెంచేదే అయితే, వారికి అందులో ఉండే పోషకాలు అందనట్లవుతుంది. అలాగే వారికి తినే విధానం కూడా నేర్పించాలి. టైం కు తినడం అలవాటు చేయాలి. నెమ్మదిగా తినడం నేర్పించాలి. రాత్రి త్వరగా పడుకుంటే.. ఉదయం త్వరగా లేస్తారు ముఖ్యంగా ఈ విధానాన్ని అలవాటు చేయాలి. దీంతో వాళ్లు స్కూల్ కు సమయం మించిపోతుందని గబగబా తినే అవసరం ఉండదు. ఇంట్లో మనం తినిపించే విధానమే రేపు నలుగురిట్లో వెళితే వారు అదే విధంగా తింటారు. How to habituate food to kids
How to habituate food to kids: అలాగే, వాళ్లకు ఫుడ్ తో మభ్యపెట్టే పనులు చేయకూడదు. అంటే ఫలానా సబ్జెక్టులో మార్కలు బాగా వస్తే.. చాక్లేట్ ఇప్పిస్తా అని చెప్పవద్దు. ఇలా వారికి చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లను నేర్పిస్తే.. భవిష్యత్తులో వారికి అనారోగ్య సమస్యలు ప్రబలకుండా ఉంటాయి. అలాగే వారికి కొసరికొసరి వడ్డించవద్దు. వారికి ఎంత సరిపోతుందో గ్రహించి తినిపించాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు.. అనారోగ్యకరమైన ఫుడ్ తింటే కలిగే దుష్ఫలితాలు కూడా వారికి చెప్పాలి.