(dealing with a jealous colleague)ఏ పనిప్రదేశంలోనైనా.. అసూయపడే కొలీగ్స్ కచ్ఛితంగా ఉంటారు. కానీ, మీరెంత మంచి పనితనం కనబర్చినా.. మంచి పరిచయాలు మీకున్నా.. బాస్ మిమ్మల్ని మెచ్చుకున్నా.. మంచి డ్రెస్సెస్ వేసుకున్నా..వారు సహించరు. కానీ, మీరు మాత్రం మీ సహనాన్ని కోల్పోకుండా ఎలా వ్యవహరిస్తారు? అసూయపడే సహోద్యోగితో వ్యవహరించడంలో మీకు సహాయపడే కొన్ని వ్యూహాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
సైలెన్స్..
మీ వద్ద మంచి విషయం ఉంటే.. అది మీ అభివృద్ధికి సూచిక కావచ్చు. అందుకే అప్పటి వరకు మౌనంగా ఉండండి. మీరంటే ఇష్టం ఉండే.. బయట వ్యక్తులకు షేర్ చేయండి. మీ ఆఫీసు ప్రాంగణంలో చెబితే.. మీరు అహంకారి అనుకుంటారు. కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎవరూ మీ గురించి చెప్పలేరు. (dealing with a jealous colleague)
క్షమాపణ చెప్పకండి..
మీరు చేయని తప్పునకు క్షమించమని అడగకండి. మీరు ఏదైనా సాధిస్తారు కాబట్టి దాన్ని గురించి సంతోషంగా ఉండండి. దాన్ని తక్కువ చేసి క్షమాపణలు చెప్పకండి. మంచి మాటలు చెప్పే వ్యక్తుల మాటలు స్వీకరించి, ఆ పై మీ పనిని కొనసాగించండి. ఎవరికైనా ఈర్ష్య ఉంటే అది వారి సమస్య. ఇది మీ ఘనత కాబట్టి మీ గురించి మీరు ఎందుకు గర్వపడకూడదు? (dealing with a jealous colleague)