కరోనాతో అందరి టైం టేబుల్ మారిపోయింది. బిజీలైఫ్ కారణంగా ఒత్తిడి (stress) అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర (Sleep) కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర (peaceful sleep) చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది.
మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు , కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు (Sleep tips) ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం..