చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను, మొటిమలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు యుక్త వయసులో మొటిమలు (Pimples) రావడం సాధారణం. వీటివల్ల ముఖం, మెడపైన మచ్చలు (Black spots) ఏర్పడుతూ ఉంటాయి. యుక్త వయసులో హార్మోన్లు, చర్మ సంరక్షణ అలవాట్ల కారణంగా మొటిమలు ఏర్పడతాయి.
అయితే రాత్రికి రాత్రే వీటిని రాకుండా చేయడం సాధ్యం కాదు. కొన్ని ఉత్పత్తులు వాడటం ద్వారా కొంత కాలానికి వీటిని అదుపు చేయవచ్చు. మొటిమలకు చెక్ పెట్టేందుకు ఒక ప్రొడక్ట్ వాడిన తరువాత.. ఫలితం కనిపించేందుకు కనీసం నాలుగు వారాల సమయం అవసరం. ఒకటి రెండు రోజులు వాడి వీటిపై ఒక నిర్ణయానికి రావద్దు. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్‌తో పాటు మరికొన్ని జాగ్రత్తలు సైతం పాటించాలంటున్నారు నిపుణులు.