జుట్టు రాలడం, ఆ ప్రదేశంలో కొత్త వెంట్రుకలు మొలవడం, పెరగడం, మళ్లీ అవి కూడా రాలిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఆరోగ్యంగా ఉండేవారికి రోజూ 60-100 వెంట్రుకలు రాలుతాయి. ఈ స్థానంలో మళ్లీ కొత్త వెంట్రుకలు వస్తాయి. అలా రాకపోతే జాగ్రత్త పడాలి. మన తలపై సుమారు 100,000 (hair follicles) కేశాలుంటాయి. ఇవి రోజూ పెరుగుతూనే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మహిళల్లో బట్టతల: మహిళల్లో కూడా బట్టతల ఈమధ్య కాలంలో బాగా కనిపిస్తోంది. మారుతున్న లైఫ్ స్టైల్, వాతావరణ మార్పులు, టెన్షన్లు, విటమిన్ల లోపం, హార్మోన్లలో మార్పులు వంటి ఎన్నో కారణాలతో స్త్రీలకు బట్టతల వచ్చేస్తోంది. సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. దీనికి చికిత్స లేదు. త్వరగా రాకుండా మాత్రం చేసుకోవచ్చు.
జుట్టు దువ్వే టప్పుడు పాపిట మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటే... జుట్టు ఎక్కువగా రాలిపోతోందని అర్థం. ఒక్క అమెరికాలోనే 30,00,000 (30 million women) మంది మహిళలు బట్టతలతో బాధపడుతున్నారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. మెనోపాజ్ లేదా పోస్ట్ మెనోపాజ్ సమయంలో మహిళలు బట్టతలబారిన పడొచ్చు. ఐరన్ లోపంవల్ల కూడా జుట్టు ఊడుతుంది. జుట్టుకు పోషకాలు అందించడంలో హిమోగ్లోబిన్ కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ల లోపం: విటమిన్ A, B, C, D, E, జింక్, సెలీనియం లోపం ఉంటే జుట్టు రాలుతుంది. ఈ విషయంపై మీకు స్పష్టత రావాలంటే డాక్టర్లతో టెస్టులు చేయించుకోవాలి. విటమిన్స్, మినరల్స్ లోపం ఉంటే వీటిని అధిగమించేందుకు అవసమైన టాబ్లెట్లు వేసుకుని, మంచి పోషకాహారం తింటే సరిపోతుంది. ఒకవేళ హార్మోన్ల సమస్య ఉంటే సరైన చికిత్స, క్రమం తప్పకుండా పరీక్షలు అవసరమవుతాయని గుర్తుంచుకోండి.
థైరాయిడ్ సమస్యలు: అమెరికాలో ప్రతి 10 మందిలో ఒకరికి (one in 10 people) ఈ సమస్య ఉంటుంది. మహిళల్లో అత్యధికులు థైరాయిడ్ బారిన పడుతుంటారు. థైరాయిడ్ సమతుల్యంగా లేకపోవడంతో జుట్టు కుదుళ్లు బలహీనపడి, తల పల్చబారుతుంది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రెండూ జుట్టు రాలేలా చేస్తాయి. జుట్టుపై తీవ్ర ప్రభావం చూపే థైరాయిడ్ స్థాయిలు ఎలా ఉన్నాయో సరిచూసుకోవడం చాలా ముఖ్యం
చుండ్రు: చుండ్రు వంటి చర్మ సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. స్కాల్ప్ పై దురద, చుండ్రు అదుపులో లేకపోవడం వల్ల స్త్రీ, పురుషుల్లో రోజూ జుట్టు రాలడం రొటీన్‌గా మారుతుంది. క్రమం తప్పకుండా తలస్నానం చేయడం, హానికరమైన రసాయనాలు లేని సబ్బు లేదా సోపుతో తలస్నానం చేయడం వంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలర్జీలతో కూడా జుట్టు రాలుతుంది కనుక చర్మవ్యాధి నిపుణులను సంప్రదిస్తే చుండ్రు, దురద, అలర్జీలు తగ్గేలా చికిత్స తీసుకుని జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.
హెయిర్ డై: జుట్టుకు రంగు వేసేవారిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. ఎన్నో రసాయనాలతో తయారయ్యే హెయిర్ డై జుట్టుకు బాగా హాని చేస్తుంది. దీంతో అలర్జీలు కూడా వస్తాయి. స్టైల్‌గా కనిపించేందుకు హైలైటర్స్ ప్రయోగించేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. హెయిర్ డైల్లోని పారాఫినైల్ డయమిన్ (PPD) వల్ల అలర్జీలు వచ్చి కుదుళ్లు పల్చబడతాయి.