ఒక అరటిపండు, ఒక టీస్పూన్ ఆలివ్ఆయిల్, ఒక టీస్పూన్ అలొవెరా జెల్... ఈ మూడింటిని కలిపి పేస్టులా చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది.