DO YOU FACING DANDRUFF PROBLEM ON YOUR HAIR REGULARLY THEN FOLLOW THIS HOME METHODS TO GET RID OF IT EASILY PRV
Dandruff home remedies: మీ జుట్టులో చుండ్రు అధికంగా ఉందా? అయితే ఈ చిన్న చిన్న టిప్స్‌తోనే దూరం చేసుకోండి
చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై (apply) చేయరు. దాని వలన తలలో చర్మం పొడిబారి చుండ్రు (dandruff), జుట్టు రాలే సమస్యలు వస్తాయి. కొన్ని సహజ పద్దతులతో జుట్టుని కాపాడుకోవచ్చు
చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ది.
2/ 10
కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు (white hair) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది.
3/ 10
వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (Products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.
4/ 10
చుండ్రు చిన్న సమస్యగానే కనిపిస్తుంది. కానీ దాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమవుతున్న వారిని చూస్తూనే ఉంటాం. అయితే షాంపూల అవసరం లేకుండా చుండ్రును దూరం చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి (dandruff home remedies). అవేమిటంటే...
5/ 10
అలోవెరా (Aloe vera)లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది.
6/ 10
శీకాయ, కుంకుడుకాయలు జుట్టుకి చక్కటి క్లెన్సర్స్‌గా (cleaners) పనిచేస్తాయి. మాడుని శుభ్ర పరుస్తాయి (clean). వీటిలో ఉండే విటమిన్-ఎ, కె, సి,డీలు జుట్టును ఆరోగ్యం (healthy hair)గా ఉంచుతాయి.
7/ 10
ముందుగా ఈ కాయల్ని వేడి నీళ్లల్లో వేసి మరగనివ్వాలి. అందులోనే గుప్పెడు మందార పూలూ కూడా వేయాలి. బాగా కాచిన ఆ నీళ్లను చల్లారాక వడకట్టాలి. ఆపై వాటితో తలస్నానం చేస్తే సరి. జుట్టు మెత్తగా మారుతుంది. చుండ్రు (dandruff) సమస్య దరిచేరదు
8/ 10
మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయాలి.
9/ 10
వారంలో రెండు రోజులు తలకు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి.
10/ 10
నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్ మాదిరిగా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి.