కోడి గుడ్లు ఫ్రిజ్ లో పెట్టరాదు. అదేంటి కోడి గుడ్లు పెట్టేందుకు ఫ్రిజ్ లో స్పెషల్ రాక్ కూడా ఉంది కదా ఎందుకు పెట్టరాదు, మెమెప్పుడు అలాగే పెడతాం.. ఇలా పెడితే ఎక్కువ రోజులు చెడిపోకుండా గుడ్లు ఫ్రెష్ గా ఉంటాయని వాదించకండి. గుడ్లను ఇలా ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా (bacteria) పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.
గుడ్లలోని పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాల్షియం, ప్రొటీన్ (protein) వంటివి పుష్కలంగా ఉన్న గుడ్లను మనం సాధారణంగా ఫ్రిజ్లో పెడతాం. ఇలా ఫ్రిజ్లో దాచిన గుడ్లు తింటే ఆరోగ్యం సంగతేమోకానీ అనారోగ్యం తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ (room temperature) వద్దకు తేగానే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ.
అయితే ఫ్రిజ్ డోర్ పదేపదే వేయడం తీయడంతో డోర్ లో ఉన్న గుడ్ల ఉష్ణోగ్రతల్లో మార్పులపై ప్రభావం ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. అందుకే ఒకవేళ మీరు ఫ్రిజ్ లో వీటిని ఉంచాల్సి వస్తే ముందు బలమైన కార్టన్ బాక్స్ లేదా గాలి దూరని డబ్బాలో వీటిని పెట్టి, ఫ్రిజ్ వెనకల భాగంలో పెట్టండి. డోర్ లో మాత్రం పెట్టకండి. ఇలా చేస్తే బ్యాక్టీరియా గుడ్లపై చేరే ప్రమాదం ఉండదు.