మీ లక్ష్యాలు..
జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి లక్ష్యాల విషయానికి వస్తే, దాన్ని ఇతరులతో పంచుకోవాలి తప్ప గోప్యమైన విషయాలను అన్నింటినీ పంచుకోకూడదు.
మొదట మిమ్మల్ని ఇతరులు ఎగతాళి చేయవచ్చు. రెండోది, మీరు లక్ష్యాన్ని సాధించకపోతే.. మీరు ఇతరుల నుంచి భిన్నమైన ప్రశ్నలను ఎదుర్కొంటారు. ఇది మీపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.
మీ బలహీనతలు..
ఒక వ్యక్తి బలహీనతలు బయటకు కనిపించవు. కేవలం ఆ వ్యక్తి వాటిని ఇతరులతో షేర్ చేసినప్పుడు మాత్రమే వారికి తెలిసిపోతాయి. అయితే, బలహీనతలు వ్యక్తిగత విషయం, దాని గురించి మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులు దాని గురించి తెలుసుకుంటే.. వారు దాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. Keeps Should Be Keep Secretly