కరోనా తక్కువగా ఉన్నందుకు చాలా మంది ప్రజలు విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. 2 ఏళ్లకుపైగా ఇంట్లోనే గడిపారు. అందుకే బయటికి వెళ్లి మనలోని భారాన్ని దించి ప్రకృతి మాత ఒడిలో సేదతీరాలని చాలా మంది అనుకుంటారు. వేసవి కాలం కూడా అలాగే మొదలైంది.. కాబట్టి సుందరమైన, నిశ్శబ్ద ప్రదేశంగా ఉండే పర్యాటక స్థలాన్ని చూడాలని అనుకుంటున్నారా?.
డార్జిలింగ్: డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్‌లోని గంభీరమైన కొండలలో ఉన్న నగరం. మీరు ఇక్కడికి వెళ్లి మీ వేసవి సెలవులను గొప్పగా చేసుకోవచ్చు. నగరం చుట్టూ కాంచన్‌జంగా శ్రేణి, అందమైన తేయాకు తోటలు ఉన్నాయి. డార్జిలింగ్‌లో వేసవి వేడిని తగ్గించవచ్చు. ప్రకృతి చుట్టూ ఉన్న నగరం పచ్చని తోటలు ,అడవుల గుండా రైలు ప్రయాణం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈశాన్య ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ చూడడానికి పచ్చటి పరిసరాలు, సరస్సులు ,జలపాతాలు ఉన్నాయి. షిల్లాంగ్‌లో ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్, స్వీట్ ఫాల్స్ ,ఉమియం లేక్ వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది వేసవికి అనువైన అద్భుతమైన పర్యాటక నగరం.
లడఖ్: నేటి యువతలో చాలా మందికి లడఖ్ ఒక కల. దక్షిణాదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్తరాదికి పర్యాటకం కోసం వెళ్ళడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన హిల్ స్టేషన్లలో లడఖ్ ఒకటి. ఎత్తైన పర్వత శ్రేణుల్లో భాగం కావడంతో ఇక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. మీరు ఇక్కడ చాలా సాహసాలు చేయవచ్చు, టిబెటన్ సంస్కృతిని ఆస్వాదించవచ్చు .జాన్స్కర్ వ్యాలీ, పాంగ్కాంగ్ చో లేక్, చో మోరిరి ,హెమిస్ నేషనల్ పార్క్‌లలో మీ వేసవిని గడపవచ్చు.