పెళ్లికి వచ్చే చాలా మంది అతిథులు ఏ ఉపయోగం లేని గిఫ్ట్ లను ఇస్తారు. ఇవి జంటలకు ఏం చేయాలో అర్థం కాక ఏమూలనో పడేస్తారు. అందులో ఒకటి ఫోటో ఫ్రేమ్. ఇది మీకు మొదటి ఎంపిక కానీ, ప్రస్తుతం ఈ గిఫ్ట్ చాలా బోరింగ్ ఎంపిక. అవును, అలాంటివి ఇస్తే జీవితకాలంపాటు పెట్టెలో పటేస్తారు. ఏ జంటకు అతిథులు అలాంటి బహుమతులు ఇవ్వకూడదు. కాబట్టి వారికి ఉపయోగపడే ఇలాంటి వాటి ఆప్షన్ను వారికి ఇస్తే బాగుంటుంది. పెళ్లిలో దంపతులకు ఎలాంటి బహుమతులు ఇవ్వవచ్చో తెలుసుకుందాం.
కపుల్ వాచ్..
ఈ రోజుల్లో కపుల్ వాచ్ అనేక డిజైన్లు మార్కెట్లో లేదా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బహుమతి వివాహితులకు చాలా మంచి ఎంపిక. ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈసారి పెళ్లికి వెళ్తే మీరు కూడా ఈ గిఫ్టునే ఇవ్వండి.(Do not give boring photo frame to newly wed couple Find out more good gifts )
ప్లాంట్...
ఏ వ్యక్తి అయినా ఇంట్లో మొదటగా తోటపనిని ఇష్టపడతారు. అందుకే కొత్తగా పెళ్లైన జంటకు చిన్న మొక్కలు లేదా వేలాడే మొక్కలను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ బహుమతులు ఎదుటి వ్యక్తికి అందంగా కనిపించడమే కాకుండా వారి ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. ఈ మధ్య కాలంలో ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఇలాంటి మొక్కలు బహుమతిగా ఇస్తే జంట తప్పకుండా ఆనంత పడతుంది.(Do not give boring photo frame to newly wed couple Find out more good gifts )
క్యారికేచర్..
ఈ ఫోటో క్యారికేచర్ లు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మీరు కొత్తగా పెళ్లైన జంటకు వీటిని బహుమతిగా ఇవ్వవచ్చు. వధూవరులు కూడా దానిని చాలా ఇష్టపడతారు. క్యారికేచర్ లో వారి ప్రత్యేక క్షణాలను క్యాప్చర్ చేయించి ఇవచ్చు.(Image credits facebook)(Do not give boring photo frame to newly wed couple Find out more good gifts )
కాఫీ లేదా టీ మెషిన్
పెళ్లి కాబోతున్న మీ స్నేహితుడు కాఫీ తాగడానికి ఇష్టపడితే, ఈ ఎంపిక మీకు చాలా మంచిది. మీరు వారికి కాఫీ మేకర్ని బహుమతిగా ఇవ్వవచ్చు. వారు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ప్రతి వంటింట్లో అందుబాటులో ఉంటుంది. ఉపయోగం కూడా చాలా ఉంటుంది. మరి ఈసారి వెడ్డింగ్ గిఫ్టులుగా ఈ బహుమతులను మీతోపాటు తీసుకెళ్లండి..(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)