ఈ మధ్య కాలంలో అందరూ జట్టు ఊడిపోంతోదని చాలా బాధపడుతున్నారు. జట్టును చక్కగా మెయింటెన్ చేయడం చాలా కష్టమైన పనిగా మారింది. పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల కూడా జట్టు ఊడడం ఎక్కువైపోయింది. అయితే వెంట్రుకలు రాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల కూడా జట్టు మరింత రాలిపోతుంది. కాబట్టి అలాంటి తప్పులేంటో తెలుసుకుని కేర్ఫుల్గా ఉండండి.
* తలస్నానం : హెయిర్ కేర్ రొటీన్లో తలస్నానం చాలా ముఖ్యమైనది. కొంతమంది బాగా వేడి నీటితో తలస్నానం చేస్తుంటారు. దీని వల్ల వెంట్రుకలు పొడిబారడమే కాకుండా బాగా రాలిపోతాయి. జట్టుకు గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తేనే కాంతివంతంగా తేమతో ఉంటుంది. పోషణ కూడా అందుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మరీ వేడి నీరు వాడితే బాగా పొడిబారిపోయి చిట్లిపోతుంది.
* షాంపూ : పొడి జట్టుకు షాంపూ పెట్టుకోకూడదు. జట్టును గోరువెచ్చని నీటితో తడిపిన తర్వాతే షాంపూ అప్లై చేసుకోవాలి. షాంపూ, కండిషనర్ పూర్తిగా పోయేలా నీళ్లతో చక్కగా కడగాలి. లేదంటే జట్టు ఊడుతుంది. చాలా మంది షాంపూను సరిగ్గా వాష్ చేసుకోకపోవడం వల్ల కొంతకాలానికి వాటి రసాయనాల ప్రభావం వెంట్రుకలపై పడుతుంది. ఫలితంగా జట్టు ఊడిపోతుంది.
జుట్టుకు వారానికి రెండుసార్లైనా నూనెతో మంచిగా మర్దన చేసుకోవాలి. రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అస్సలు నూనె రాయకపోతే జుట్టు పొడిబారుతుంది. ఇష్టం వచ్చినట్లు స్టైలింగ్ ప్రొడక్ట్స్ జుట్టుకు వాడకూడదు. దీర్ఘకాలంగా స్ప్రేలు, రకరకాల డైలు వాడితే జట్టు పాడవుతుంది. నిస్తేజంగా మారుతుంది.
జట్టును బాగా లాగి కడితే కూడా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గట్టిగా పోనిటెయిల్ వేస్తే వెంట్రుకల రూట్స్, ఫాలికిల్స్ డ్యామేజ్ అవుతాయి. ఆహారం సమయానికి తీసుకోకపోవడం వల్ల కూడా జట్టు ఎక్కువగా ఊడుతుంది. మంచి పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే జట్టుకు సరిపడినన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటుంది.