Diwali 2020: దీపావళి, ధనత్రయోదశి సమయమిది... ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కుని ఆ ధనలక్ష్మీని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. ఈ సందర్భంగా మహిళలు సరికొత్త ఆభరణాలను కొంటుంటారు. ఆ జ్యువెలరీ అటు సంప్రదాయంగా ఇటు ఆధునికంగా... రెండు విధాలా ఉండాలనుకుంటారు... దిపావళి సందర్భంగా... కొత్త డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తద్వారా మనకు సెట్ అయ్యే సరైన నగలను కొనుక్కొని అందరి చూపూ మనపైనే ఉండేలా చేసుకోవచ్చు.
మామిడి పిందెల డిజైన్స్: అమ్మమ్మల కాలం నుంచి నేటి ఆధునిక అమ్మాయిల వరకూ అలరిస్తున్న డిజైన్స్ మామిడిపిందెల రూపం. ఇళ్ళల్లో ఏ వేడుకైనా సరే... ఈ డిజైన్‌తో కూడిన వస్త్రాలైనా... నగలైనా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే... ఇప్పుడు జ్యువెలరీ డిజైనర్స్ ఈ రూపంలోనే నగలను రూపొందిస్తున్నారు. అయితే... ఇందులోనూ ఆధునికంగా పూసలు, ఎమరాల్డ్స్ని పెట్టి సరికొత్తగా రూపొందిస్తున్నారు. ఇంట్లో జరిగే పూజలు, వ్రతాలకు ఈ ఆభరణం ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి బంగారం తీసుకునే వారు... ఈ నగను ఓసారి పరిశీలించండి.
లక్ష్మీ రూపుతో ఆభరణాలు: లక్ష్మీదేవి రూపుగల ఆభరణాలు... ఈమధ్యకాలంలో చాలా ఫ్యాషన్‌గా మారాయి. ఈ రూపులతో చిన్న నెక్లెస్, గాజులు, చేయించుకుంటున్నారు. ఇవి పట్టుచీరల మీదకే కాదు... ప్లెయిన్ శారీస్... అనార్కలీ వంటి డ్రెస్సెస్ మీద కూడా చాలా చక్కగా ఉంటాయి. డిజైనర్స్ కూడా ఎంతో చక్కగా వీటిని రూపొందిస్తున్నారు.
ధర ఎక్కువ నగ తక్కువ: బంగారం ధరలు బాగా పెరిగి పోవడంతో... ఈసారి జ్యువెలరీస్ వారు అత్యంత చిన్న, సన్నటి నగలను తయారుచేస్తున్నారు. అందువల్ల రేటు ఎక్కువైనా కొనుక్కునేవారికి అంత ఎక్కువ కాస్ట్ అవ్వకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇది వరకు పెద్ద సైజులో చేసిన నగలను కూడా ఇప్పుడు వీలైనంత చిన్నగా చేస్తూ... అవసరాలకు తగ్గట్టుగా అందిస్తున్నారు.