వెదర్ కాస్త చల్ల పడిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా ఫ్లూతో సహా అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. దగ్గు, గొంతునొప్పి లాంటి లక్షణాలు తీవ్ర ఇబ్బంది పెడతాయి. అయితే ట్యాబ్లెట్స్ ఎంత ఇంపార్టెంటో.. నేచురల్ రెమెడీలు కూడా అంతే ముఖ్యం. మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడాతాయి ఈ రెమెడీస్. అవన్ని మన కిచెన్లోనే ఉంటాయి. Photo from Pexels
చాలామంది లవంగాలను సుగంధద్రవ్యాలుగా, కేవలం మసాలాదినుసులుగా మాత్రమే చూస్తారు. కానీ లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న లవంగాలు సీజనల్ ఫ్లూ నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా నిరంతర దగ్గు వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. Photo from Pexels