అంతర్జాతీయంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న వాతావరణంలో ఇతర దేశాల కంటే అత్యధిక సంఖ్యలో టైప్ 2 డయాబెటిస్ పేషంట్స్ భారత్‌లో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 69 మిలియన్ల మందితో, 2040 నాటికి ఆ సంఖ్య 140 మిలియన్లకు పెరగనుందని అంచనా.. ఇతర ఖండాలు, దేశాలతో పోలిస్తే.. ఆషియాలో ముఖ్యంగా భారత్‌లో ప్రీ డయాబెటిస్ నుంచి డయాబెటిస్ మార్పు చాలా వేగంగా జరుగుతుంది.
లైఫ్ స్టైల్లో సరైన చర్యలు తీసుకోవడంలో భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ వైపు ప్రభావాలు, సమస్యలను నివారించడం ఉత్తమ మార్గం. సాధారణ వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, ఆహారంపై శ్రద్ధ చూపడం. ఇదే సరైన మార్గమని మధుమేహ వ్యాధిగ్రస్తులు తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల వారి ఆరోగ్యన్ని సంరక్షించుకోవచ్చు.
మాంసకృత్తులు..
మాంసకృత్తల్లో ఉండే ప్రోటీన్ ఇన్సులిన్ ను పెంచడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా కొవ్వులను కలిగి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఆహారంలో మంచి, సులభంగా జీర్ణించుకోగలిగే ప్రోటీన్‌ను చేర్చడం