ప్రతి సమస్యకు ఓ పరిష్కారముంటుంది.. అందులో యూత్ ఆలోచించే సొలూష్యన్ ఒక మెట్టుపైనే ఉంటుంది. అది కూడా లవర్(lover) కోసం వేసే ప్రతి అడుగు పెద్దవాళ్ల ఊహకు అందనిదై ఉంటుంది. వాలెంటైన్స్ డే(valentines day)కు సమయం ముంచుకొస్తుండడంతో లవర్ ఉన్నవాళ్లు తమ బిజీ ప్లాన్స్‌లో షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. తమకు ఇష్టమైన వాళ్లకు ప్రపొజ్ చేద్దామనుకున్నావాళ్లు తమ ఐడియాకు పదును పెడుతున్నారు. మరి రెండు క్యాటగీరిల్లో లేనొళ్ల ఏం చేస్తున్నారో తెలుసా..? (ప్రతీకాత్మక చిత్రం/Image Credit gettyimages)
ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. డేటింగ్ యాప్స్(dating apps) వచ్చాక మనకు తెలియని వారితో మాట్లాడడం..వాళ్లతో ప్రేమలో పడడం ఈమధ్య సర్వసాధారణమైపోతుంది. ఇండియాలో ఉన్న వారు ఇంగ్లండ్ అమ్మాయితో ప్రేమలో పడుతున్నారంటే దానికి కారణం డేటింగ్ యాప్సే. ఇలా లోకల్‌గా కూడా మనకు తెలియని వాళ్లని ప్రేమించే అవకాశాలు డేటింగ్ యాప్స్ కల్పిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం/Image Credit gettyimages)
ఇక మిస్టర్ పర్ఫెక్ట్(Mr.Perfect) సినిమా గుర్తింది కదా..? అందులో హీరో ప్రభాస్(Prabhas), హీరోయిన్ తాప్సీ తమ ఇష్టాయిష్టాలను ఓ అప్లికేషన్‌పై ఫిల్ చేస్తారు. అలా ఇద్దరి లైక్స్ మ్యాచ్ అవుతాయి. ఇలా అప్పటివరకు ఒకరికిఒకరు పరిచయం లేకపోయినా.. కలుసుకోని ప్రేమలో పడతారు.. సేమ్ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు కొందరు. (Image credit Deccan chronicle)
డేటింగ్లో మరో యాంగిల్ ఇది. ప్రజలు వారి వివరాలను నింపి, ఒకే రకమైన అభిరుచి, ఇష్టాయిష్టాలు ఉన్న వ్యక్తితో కనెక్ట్ చేయడానికి అల్గారిథమ్స్ సహాయం తీసుకుంటారు. డేటింగ్ యాప్స్‌తో ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఐడియాను ఫాలో అవుతూ తమకు నచ్చిన పార్టనర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం/Image Credit gettyimages)