పెళ్లి తరువాత నవదంపతులు హనీమూన్ (Honeymoon) కి ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తుంటారు. వింటర్ లో చలితో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో కొత్త జంటలు హనీమూన్ ప్రదేశాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. చల్లని చలికి మంచుదుప్పటితో ముసుగేసిన భానుడిని కిలకిలారావాలతో లే లేమ్మని మేల్కొలిపే పక్షుల సందడి.. నల్లని అడవిని ఆక్రమించి తెల్లని మంచు ఆడే వయ్యారాల సయ్యాటలు.. చలికాలంలో ఇవే కదా ప్రకృతి అందాలు! ఈ శీతాకాల ఆనందాలకోసం అర్రులు చాస్తున్నారు. నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఆనందంగా గడిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ నగరం వింటర్ సీజన్ లో హనీమూన్‌కి బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా శీతాకాలంలో, నవదంపతులు ఈ భూతల స్వర్గాన్ని చాలా ఇష్టపడతారు. ఎత్తైన దేవదారు చెట్లు మరియు మంచుతో కప్పబడిన తేయాకు తోటల నుండి వెలువడే సువాసన మీ హనీమూన్ యాత్రను చిరస్మరణీయం చేస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సీజన్. (Image : Shutterstock)
గోవాను సందర్శించడానికి డిసెంబర్ ఉత్తమ నెల. ఎందుకంటే ఈ రోజుల్లో మరియు నూతన సంవత్సరానికి ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ గోవాలు జరుగుతాయ్. పెళ్లైన కొత్త జంటలు గోవాలో డ్యాన్స్, వాటర్ గేమ్స్ మరియు రివర్ క్రూయిజ్లను కూడా ఆనందించవచ్చు. మీరు సాయంత్రం బీచ్‌లో రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్‌ను కూడా ఆస్వాదించవచ్చు. (Image : Shutterstock)