కొందరికి టీ అంటే ఇష్టం, మరికొందరు ఒక కప్పు కాఫీని అమృతంలా తీసుకుంటారు. అయితే కాఫీ తాగడం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్లు..షాపింగ్ కు వెళ్లే ముందు కనుక రిలాక్స్ గా ఉంటుందని ఓ కప్పు కాఫీ తాగితే ఇక అంతే మీ జేబేలు ఖాళీ అవడం ఖాయం. వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజమే. కాఫీ తాగి షాపింగ్‌కి వెళ్లేవారు అవసరానికి మించి డబ్బు ఖర్చు చేసి వస్తున్నారని ఓ పరిశోధనలో తేలింది.
ఇంటి నుంచి కాఫీ తాగి షాపింగ్‌కు వెళితే మెదడుపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. మీరు ఏదో కొనడానికి వెళతారు,కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఏమి తీసుకువస్తారో తెలియదు. కాఫీ తాగి షాపింగ్‌కు వెళ్లినవారు అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువ ఖర్చు చేస్తారంట. వినడానికే వింతగా ఉన్నా పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
షాపింగ్‌కు వెళ్లే ముందు ఒక కప్పు కాఫీ తాగితే.. షాపింగ్‌లో 30 శాతం పెరిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కెఫిన్.. ఉపశమనం కలిగిస్తుంది. ఇది డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అటువంటి పరిస్థితిలో శక్తి నిండిన వ్యక్తి తనకు అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తాడు. డబ్బును కూడా ఖర్చు చేస్తాడు.(ప్రతీకాత్మక చిత్రం)
ఫ్రాన్స్‌లోని రిటైల్ స్టోర్ మరియు స్పెయిన్‌లోని డిపార్ట్మెంట్ స్టోర్‌ను సందర్శించే కస్టమర్లపై పరిశోధన జరిగింది. ఇందులో 300 మందిపై పరిశోధన చేశారు. వారికి కెఫిన్ లేని కాఫీ ,నాన్ కెఫిన్ కాఫీ, నీటిని ఇచ్చారు. వారి బిల్లులను పరిశీలించగా, ఇతర గ్రూపుల కంటే కాఫీ తాగే వారే ఎక్కువ డబ్బు ఖర్చు చేసినట్లు తేలింది. వారి వస్తువులలో కూడా అనవసర వస్తువుల జాబితా పెరిగింది.