రోజూ రాత్రివేళ ఓ టీ స్పూన్ జీలకర్రను ఓ గ్లాస్ నీటిలో నానబెట్టాలి. తెల్లారి ఆ నీటిని తాగేయాలి. దాని వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం మెరుస్తుంది. ఇలా రోజూ చేస్తూ ఉంటే మన శరీరంలో జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారవుతుంది. తిన్న ఆహారం కొవ్వులా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జీర్ణం అయిపోతుందని అధ్యయనాల్లో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
పైగా ఆకలి ఎక్కువగా వెయ్యకుండా చేస్తుంది. అందువల్ల ఈ నీరు తాగిన వారికి ఆకలి అంతగా వెయ్యదు. బాడీలో చెడు కొవ్వు కరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. బరువు పెరగడానికి ప్రధాన కారణం పొట్టే. పొట్టను తగ్గించుకుంటే దాని చుట్టూ కొవ్వు కూడా తగ్గుతుంది. ఫలితంగా బాడీపై మనకు కంట్రోల్ వస్తుంది. చురుగ్గా తయారవుతాం. దాంతో బరువు తగ్గడానికి ప్రయత్నాలు గట్టిగా చేసేందుకు వీలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)