అసలు క్రయోనిక్ టెక్నిక్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..? అనే కదా మీ డౌట్. అందరిలో ఉన్న సందేహాల్ని తొలగించడానికే ఈ వార్తను మీ ముందుకు తెచ్చాం. అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను ప్రత్యేక టెక్నిక్‌తో చల్లగా, అత్యంత సురక్షితంగా ఉంచుతున్నట్లు మీడియా నివేదికల్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రయోనిక్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని, చనిపోయిన మనుషులను తిరిగి బ్రతికించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.(AP File)
క్రయోనిక్ టెక్నాలజీ ద్వారా పిల్లలు, శిశువుల మృతదేహాలను కూడా సురక్షితంగా ఉంచుతున్నారు. అదే సమయంలో, మానవ స్పెర్మ్‌ను సంరక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్రయోనిక్ టెక్నాలజీ ద్వారా శరీరాన్ని కాపాడుకోవడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. క్రయోనిక్ టెక్నిక్ ద్వారా శరీరాన్ని భద్రపరచడానికి కోటి రూపాయలు ఖర్చవుతుందని ఒక నివేదిక పేర్కొంది.(ఫైల్ ఫోటో)