వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల.. కరోనా రాదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐతే ఇందులో నిజం లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. వేడి నీటితో.. కరోనా వైరస్ను నిర్మూలించడం, కరోనా తీవ్రతను తగ్గించడమనే దాంట్లో వాస్తవం లేదు. ల్యాబొరేటరీల్లో 70 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. గోమూత్రం తాగితే కరోనా రాదని.. పలానా మంత్రం జపిస్తే కరోనా దరిచేరదన్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి.. కేవలం వ్యాక్సిన్లు, మాస్క్లు,భౌతిక దూరం ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)